విడుదలైన ప్రేమ కథా చిత్రమ్ ఫస్ట్ లుక్

విడుదలైన ప్రేమ కథా చిత్రమ్ ఫస్ట్ లుక్

Published on Mar 10, 2013 7:02 PM IST

Prema-Katha-Chitram

సుధీర్ బాబు, నందిత హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ‘ప్రేమకథా చిత్రమ్’ ఫస్ట్ లుక్ ఈ రోజు ఉదయం హైదారాబాద్లో విడుదలైంది. మారుతి, సుధీర్ బాబు, జె. ప్రభాకర్ రెడ్డి, జెబి, స్వామి, సుదర్శన్ రెడ్డి, నందింత విచ్చేసిన ఈ కార్యక్రమంలో రమేష్ ప్రసాద్ ఫస్ట్ లుక్ లాంచ్ చేసారు. ఈ సినిమాకి జె. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ – డైరెక్టర్ కాగా, మారుతి స్టొరీ, డైలాగ్స్ తో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసారు.

ఈ సినిమా గురించి మారుతి మాట్లాడుతూ ‘ నా గత చిత్రాల్లా కాకుండా ప్రేమకథా చిత్రమ్ క్లీన్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను తీసిన ‘బస్ స్టాప్’ ని చూసిన చాలా మంది విమర్శించారు కానీ వారందరూ ఈ సినిమా చూసిన తర్వాత కొత్త అనుభూతికి లోనవుతారని ఖచ్చితంగా చెప్పగలను. నేను ఈ స్టేజ్ కి రావడానికి చాలా కష్ట పడ్డాను. నా ఫ్రెండ్స్ కి, నా సహోద్యోగుల సపోర్ట్ లేకపోతే ఇదంతా సాదించే వాన్ని కాదు. సుదీర్ బాబు – నందితల నటన చాలా సూపర్బ్ గా ఉంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ 14న రిలీజ్ చేసి సినిమాని మే 10న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ ‘ నా మొదటి సినిమా ‘ఎస్.ఎం.ఎస్’ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు గారు కూడా నా వాయిస్ ని మార్చుకోమన్నారు. నాకు తెలిసి నేను ఇప్పుడు మార్చుకున్నాను. ప్రతి ఒక్కరినీ ప్రేమ కథా చిత్రమ్ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నాకు సపోర్ట్ చేసిన సుదర్శన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మారుతి లకు నా థాంక్స్ అని’ అన్నాడు.

ప్రేమకథా చిత్రమ్ ఫస్ట్ లుక్ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు