సముద్రమంత ప్రేమతో రానున్న ‘ఉప్పెన’ !

సముద్రమంత ప్రేమతో రానున్న ‘ఉప్పెన’ !

Published on Jan 23, 2020 4:32 PM IST

మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో వైష్ణ‌వ్‌ తేజ్ సముద్రం వైపు తిరిగి గట్టిగా అరుస్తూ కనిపించాడు. సముద్రమంత ప్రేమ మా సినిమాలో ఉందనే సెన్స్ ను ఎలివేట్ చేస్తూ మేకర్స్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిజైన్ చేసి వదిలారు. మొత్తానికి పోస్టర్ అయితే సినిమా పై ఆసక్తిని పెంచుతుంది. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుంది.

ఇక వైష్ణ‌వ్‌ తేజ్ తో పాటు నూతన దర్శకుడు బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అయితే విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోయిన్ కి తండ్రిగా అలాగే విలన్ పాత్రలో కనిపించనున్నాడట.

‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు