తొలిరోజు భారీ కలెక్షన్ సొంతం చేసుకున్న పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’

తొలిరోజు భారీ కలెక్షన్ సొంతం చేసుకున్న పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’

Published on Mar 30, 2024 12:12 AM IST

మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బ్లేస్సి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సర్వైవల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది గోట్ లైఫ్. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ నేడు పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇక ఫస్ట్ డే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈమూవీ డే వన్ వరల్డ్ వైడ్ గా రూ. 16.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది.

ఇక యుఎస్ఏ లో ఈ మూవీ మలయాళ మూవీస్ లోనే హైయెస్ట్ ఓపెనర్ గా నిలిచి 114కె డాలర్స్ ని కొల్లగొట్టింది. అలానే అటు కేరళ, తమిళనాడు మరియు యుఏఈ లో కూడా మంచి ఓపెనింగ్ అందుకుంది ది గోట్ లైఫ్. ఇక రేపటి నుండి మలయాళంలో ఈమూవీ మరింతగా అదరగొట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి రాబోయే రోజుల్లో ఈమూవీ ఓవరాల్ గా ఎంతమేర కలెక్షన్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు