సెన్సేషన్ బ్యూటీ ‘ప్రియా ప్రకాష్ వారియర్’ హీరోయిన్ గా, యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా చేస్తోన్న సినిమా ‘ఇష్క్’. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం తర్వాత, తెలుగులో నిర్మిస్తోన్న ఈ చిత్రానికి యస్.యస్. రాజు అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. అయితే ఏప్రిల్ 23న ఈ చిత్రం విడుదల సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ మీడియాతో ముచ్చటిస్తూ.. ఈ ఇష్క్ మూవీలో తన పాత్ర అనసూయ అనే విలేజ్ అమ్మాయి పాత్ర అట. తను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న కాలేజ్ గాళ్ గా కనిపిస్తోందట.
ఇక తెలుగు డైలాగ్స్ పలకడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుందట. ఇష్క్ సినిమా చేసేప్పుడు డైలాగ్స్ తీసుకుని తెలుగులో ప్రాక్టీస్ చేసి సెట్స్‌కు వచ్చేదట. ఇక ఈ మూవీ ఆఫర్ తనకు అనుకోకుండా వచ్చిందని.. అయితే ఆ టైంలో ఈ సినిమా చేయాలని ప్లాన్ కూడా చేసుకోలేదని.. కాకపోతే, మెగాసూపర్ గుడ్ ఫిలింస్ వంటి మంచి బ్యానర్ లో సినిమా చేస్తే.. అది తన కెరీర్‌కు ఫ్లస్ అవుతుందని వెంటనే ఇష్క్ సెట్స్ లో జాయినైపోయాను అంటూ ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.