తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘అసురన్’ను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలుకానుంది. మొదటి నుండి ఇందులో కథానాయికగా ఎవరు నటిస్తారనే సందిగ్ధత నెలకొని ఉంది.
తాజా సమాచారం మేరకు సీనియర్ నటి ప్రియమణి హీరోయిన్ పాత్రకు ఎంపికైనట్టు తెలుస్తోంది. అయితే ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ వెలువడాల్సి ఉంది. ఇలాంటి రియలిస్టిక్ పాత్రలు చేయడం ప్రియమణికి కొత్తేమీ కాదు. గతంలో ‘పరుత్తివీరన్’ అనే సినిమాలో నేషనల్ ఆవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ప్రియమణి. కాబట్టి ఈమెను తీసుకుంటే వెంకీ సినిమాకు మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.


