‘టైగర్‌’తో నా కోరిక నెరవేరింది – ప్రియాంక చోప్రా

‘టైగర్‌’తో నా కోరిక నెరవేరింది – ప్రియాంక చోప్రా

Published on Apr 22, 2024 12:37 PM IST

గ్లోబల్ స్టార్ హీరోయిన్ ‘ప్రియాంక చోప్రా’ ‘టైగర్‌’ అనే డాక్యుమెంటరీలో అంబా అనే ఆడపులి పాత్రకు డబ్బింగ్ చెప్పింది. ఐతే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి ‘ప్రియాంక చోప్రా’ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇంతకీ ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే.. ‘‘నేను ప్రకృతికి సంబంధించిన సినిమాలను బాగా ఇష్టపడతాను. ఒక విధంగా పెద్ద అభిమానిని. మనదేశం నుంచి వస్తున్న ‘టైగర్‌’ అనే కథను నా గొంతుతో ప్రేక్షకులకు దగ్గరవడం నేను గొప్ప అవకాశంగా భావిస్తున్నాను’ అని ‘ప్రియాంక చోప్రా’ చెప్పింది.

‘ప్రియాంక చోప్రా’ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఒక నటిగా ఎన్నో పాత్రలు చేశాను. కానీ.. ఇప్పుడు కేవలం నా వాయిస్‌తోనే అనేక భావోద్వేగాలను పలికించాలి. అలాగే, ఆ ఎమోషన్స్ ను నా మాడ్యులేషన్ తోనే పండించగలగాలి. నిజంగా ఇది పెద్ద సవాలే. ఏది ఏమైనా వేరే సినిమాకి నా వాయిస్ అందించాలనే నా కోరిక ఈ ‘టైగర్‌’తో నెరవేరింది అని ‘ప్రియాంక చోప్రా’ తెలిపింది. అన్నట్టు ‘టైగర్‌’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు