ఓజి మూవీ, పవన్ పై ప్రియాంక మోహన్ కామెంట్స్!

ఓజి మూవీ, పవన్ పై ప్రియాంక మోహన్ కామెంట్స్!

Published on Feb 26, 2024 12:35 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజి (దే కాల్ హిమ్ ఓజి). ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. తాజాగా ఈ హీరోయిన్ సినిమాపై మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఓజి మూవీ చాలా బాగా వస్తుంది అని, మీరంతా ఆ మ్యాజిక్ ను స్క్రీన్ పై విట్ నెస్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ, అతను ఒక లెజెండ్, అమేజింగ్ హ్యుమన్, మరియు గ్రేట్ లీడర్ అని అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తుండగా, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు