ఈ ఈవెంట్ సో స్పెషల్ అంటున్న మహేష్ నిర్మాత

ఈ ఈవెంట్ సో స్పెషల్ అంటున్న మహేష్ నిర్మాత

Published on Jan 1, 2020 8:34 AM IST

anil sunkara

సంక్రాంతి సినిమాల సమరం ఇంకో పదిరోజులలో మొదలు కానుంది. ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ చాలా రసవత్తరంగా ఉండనుంది. రజిని, అల్లు అర్జున్, మహేష్ లతో పాటు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా ఈ సంక్రాంతికి సినిమా విడుదల చేస్తున్నారు. పోటీ రీత్యా మూవీ ప్రొమోషన్స్ కూడా గట్టిగా నిర్వహిస్తున్నారు. కాగా సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ ఈనెల 11న విడుదల కానుంది. ఈ సంధర్భంగా నిన్న పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న నిర్మాత అనిల్ సుంకర చిత్రానికి సంబంధించి అనేక విషయాలు పంచుకున్నారు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్న నేపథ్యంలో ఆయనను ఆ విషయం గురించి అడుగగా ఆసక్తికర సమాధానం చెప్పారు.

మహేష్, చిరంజీవి గతంలో కొన్ని వేడుకలలో కలిసి కనిపించినప్పటికీ సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది వారిద్దరికీ చాలా ప్రత్యేకం అన్నారు. కారణం సూపర్ స్టార్ హోస్ట్ చేస్తున్న ఈవెంట్ కి మెగాస్టార్ గెస్ట్ గా రావడం సో స్పెషల్ అని ఆయన చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు