“ది రాజా సాబ్” అప్డేట్స్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ!

“ది రాజా సాబ్” అప్డేట్స్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ!

Published on Apr 18, 2024 4:27 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ, కెరీర్ లో దూసుకు పోతున్నారు. చివరిసారిగా సలార్ (Salaar) అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో కనిపించిన ఈ హీరో, తదుపరి కల్కి (Kalki2898AD) లో కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ (The Raja Saab) అనే చిత్రం లో నటిస్తున్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. కల్కి 2898AD చిత్రం రిలీజ్ తర్వాతే అప్డేట్స్ ఉంటాయి అని కన్ఫర్మ్ చేశారు. సంజయ్ దత్ (Sanjay dutt) కీలక పాత్రలో నటిస్తుండగా, మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు