‘దూకుడు’ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మహేష్ నిర్మాత

‘దూకుడు’ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మహేష్ నిర్మాత

Published on Jul 6, 2019 12:27 AM IST

ఏదైనా సినిమా హిట్టయితే ఆ సినిమాకు సంబందించిన కొన్ని అంశాలని వేరే సినిమాలకు పాటిస్తుంటారు కొందరు హీరోలు, దర్శకులు, నిర్మాతలు. అలాంటి వారిలో అనిల్ సుంకర కూడా ఒకరు. గతంలో మహేష్ బాబు చేసిన సూపర్ హిట్ సినిమా ‘దూకుడు’ నిర్మాతల్లో అనిల్ సుంకర కూడా ఒకరు. ఆ సినిమా మొదలయ్యే సమయంలో అనిల్ సుంకర తన స్నేహితులకు, సినిమా యూనిట్ సభ్యులకు దూకుడు టైటిల్ పేరుతో కీ చైన్స్ ప్రెజెంట్ చేశారు. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది.

మహేష్ కొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ నిర్మాణంలో కూడా అనిల్ సుంకర భాగస్వామ్యంలో ఉన్నారు. ఈ చిత్రం ఈరోజే మొదలైంది. ‘దూకుడు’ మాదిరిగానే ఈ చిత్రం కూడా పెద్ద హిట్ కావాలని అనిల్ సుంకర అప్పట్లో చేసినట్టే ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ పేరుతో సన్నిహితులకు కీ చైన్స్ అందజేశారు. ఆయన సెంటిమెంట్ ఫలించాలని మనం కూడా కోరుకుందాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సైనికాధికారి పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు