ఇంటర్వ్యూ : నిర్మాత ఏ.గురురాజ్ – మా సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి.

ఇంటర్వ్యూ : నిర్మాత ఏ.గురురాజ్ – మా సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి.

Published on Dec 25, 2019 3:05 PM IST

నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా రూపొందన చిత్రం “ఊల్లాల ఊల్లాల”. సీనియర్ నటుడు సత్య ప్రకాష్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతుండగా సుఖీభవ మూవీస్ పతాకం పై ఏ. గురురాజ్ నిర్మిస్తున్నారు. ఈ సంధర్భంగా నిర్మాత ఏ. గురురాజ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం…

 

మీరు ఇండస్ట్రీలోకి మొదట నటుడిగా వచ్చారు. ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు. ఎలా అనిపిస్తోంది ?

ఒక నటుడు నిర్మాతగా మారినప్పుడు అతన్నే మెయిన్ క్యారెక్టర్ గా పెట్టుకుని సినిమా చేస్తాడు. కానీ నేను కథలో నేను ఏ పాత్రకు సెట్ అవుతానో ఆ పాత్ర మాత్రమే ఈ సినిమాలో చేశాను.

ఇప్పటి వరకూ మీరు ఎన్ని చిత్రాలు నిర్మించారు ?

మా బేన‌ర్‌లో ‘ర‌క్ష‌క‌భ‌టుడు, ఆనందం మ‌ళ్లీ మొద‌లైంది, ల‌వ‌ర్స్ డే చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఉల్లాలా ఉల్లాలా సినిమాతో మీ ముందుకు రాబోతున్నాము.

 

ఈ సినిమాని ఎందుకు నిర్మించాలనుకున్నారు. సత్య ప్రకాష్ గారినే ఎందుకు డైరెక్టర్ గా తీసుకున్నారు ?

సత్య ప్రకాష్ నాకు నటుడిగానే పరిచయం అయ్యారు. సినిమాల్లో ఆయన ఎంత క్రూరమైన విలనో బయట ఆయన అంత మంచి భక్తుడు. దాంతో ఆయనతో జర్నీ చేశాము. ఒక రోజు ఒక పాయింట్ ఉంది. వింటావా అంటే.. వినడం జరిగింది. పాయింట్ బాగుండటంతో సినిమాని మొదలు పెట్టాం.

 

సత్య ప్రకాష్ చెప్పిన కథ బాగుండొచ్చు. కానీ ఆయన్నే దర్శకుడిగా పెట్టుకోవడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా ?

నిజానికి సత్య ప్రకాష్ నటుడు అవ్వుదామని ఇండస్ట్రీకి రాలేదు అండి. ఆయన డైరెక్టర్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చారు. మధ్యలో నటుడిగా బ్రేక్ రావడంతో అలా కొనసాగాడు. ఇప్పుడు దర్శకుడు రాబోతున్నాడు.

 

సినిమాలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటి ?

ఒక డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కిన సినిమా ఇది. మా సినిమాలో మంచి కంటెంట్ ఉంది. అలాగే కామెడీతో పాటు రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి.

 

నిర్మాతగా మీరు ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవాలు పేస్ చేశారు ?

నిర్మాతగా చాల అవమానాలు ఇబ్బందులు పేస్ చేశాను. అప్పట్లో మాకు ఛాంబర్ లో కూడా కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ రోజుల్లో అవకాశాలు ఎక్కువగా దొరుకుతున్నాయి. టాలెంట్ ఉన్నవారు పైకి వస్తున్నారు.

 

మీ భవిష్యత్తు చిత్రాల గురించి ప్లాన్ ఏమిటి ?

రామ్ గోపాల్ వర్మగారితో ఓ సినిమా చెయ్యాలని ప్లాన్ ఉంది. ఆయనను కలిశాను. ఆయన దగ్గరకి వెళ్లేముందు ఆయన గురించి చాల మంది బ్యాడ్ గా చెప్పారు. కానీ ఆయన్ను కలిసాక.. బయట ఉన్న టాక్ కు ఆయన బిహేవియర్ కి పొంతన లేదు. వర్మగారు మంచి పర్సన్. అలాగే ఓ స్టార్ హీరోతో కూడా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు