“సలార్” మాస్ సినిమా…”గుంటూరు కారం” ఫ్యామిలీ సినిమా – నాగ వంశీ!

“సలార్” మాస్ సినిమా…”గుంటూరు కారం” ఫ్యామిలీ సినిమా – నాగ వంశీ!

Published on Jan 19, 2024 11:20 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం సక్సెస్ గురించి ప్రొడ్యూసర్ నాగ వంశీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సలార్ మూవీ ఒక మాస్ సినిమా, ఈ చిత్రం 1 AM షో స్ ను ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. చాలా హై ఇచ్చింది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రం ఫ్యామిలీ సినిమా. అయితే 1AM షోస్ సినిమా ఫలితం పై ప్రభావం చూపాయి అంటూ చెప్పుకొచ్చారు నాగ వంశీ. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే ఇంకా బాగా వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రం లో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించగా, మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఈశ్వరి రావు, జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు