హాయ్ నాన్న మూవీ పై నాగ వంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

హాయ్ నాన్న మూవీ పై నాగ వంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

Published on Dec 7, 2023 1:00 AM IST


హీరో నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కిన హాయ్ నాన్న మూవీ రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా, బేబీ కియారా కీలక పాత్రలో నటించడం జరిగింది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ రావడంతో ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం పై ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేశారు.

హాయ్ నాన్న చిత్రానికి అంతటా బ్లాక్ బస్టర్ వైబ్స్ ఉన్నాయి. నాని చాలా ఛార్మింగ్ గా, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గార్జియస్ గా కనిపిస్తుంది. వాళ్ళ పెయిర్ చాలా ఫ్రెష్ గా, కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. హేషం అబ్ధుల్ వహబ్ పాటలు, బేబీ కియారా క్యూట్ నేస్ నన్ను అరెస్ట్ చేశాయి. సినిమా రేపు రిలీజ్ అవుతున్న సందర్భం గా డైరెక్టర్ శౌర్యువ్ కి, హాయ్ నాన్న టీమ్ కి బెస్ట్ విషెస్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు