ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణకి మాతృ వియోగం!

ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణకి మాతృ వియోగం!

Published on May 30, 2024 4:46 PM IST

పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి, తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న నిర్మాత సూర్య దేవర రాధాకృష్ణ. ఆయన మాతృమూర్తి అయిన శ్రీమతి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) గురువారం రోజున 3 గంటల ప్రాంతం లో హృదయ సంబంధిత వ్యాధితో స్వర్గస్థులు అయ్యారు. నాగేంద్రమ్మకి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు.

రాధాకృష్ణ గారు ఆవిడకు రెండవ తనయుడు కాగా, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కి నాగేంద్రమ్మ నాయనమ్మ అవుతారు. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫిల్మ్ నగర్ లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నాగేంద్రమ్మ మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళులు ఇస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు