ఈ క్లిష్ట సమయంలో నా ఇంటికి వచ్చినందుకు అల్లుఅర్జున్ గారికి కృతజ్ఞతలు – SKN

ఈ క్లిష్ట సమయంలో నా ఇంటికి వచ్చినందుకు అల్లుఅర్జున్ గారికి కృతజ్ఞతలు – SKN

Published on Jan 23, 2024 3:36 PM IST

బేబీ చిత్రం తో తెలుగు రాష్ట్రాల్లో మరుమ్రోగిపోయిన పేరు ప్రొడ్యూసర్ SKN. ఇటీవల ఆయన తండ్రి మరణం తో దుఃఖం లోకి వెళ్ళిపోయారు. ఈ మేరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ SKN ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అల్లు అర్జున్ తన ఇంటికి రావడం పట్ల SKN ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ క్లిష్ట సమయంలో నా ఇంటికి వచ్చినందుకు నా ప్రియమైన ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా తండ్రి మృతికి ఆయన ఉనికి మరియు సంతాపం నాకు ప్రపంచాన్ని సూచిస్తుంది. మీ దయ, మద్దతుకు ధన్యవాదాలు అని అన్నారు. అందుకు సంబందించిన ఫోటోలను షేర్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు