‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై నిర్మాత SKN లీక్..!

pedi

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర వేడుకలో నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ, ఈ సినిమా జూన్ 26, 2026న విడుదల కాబోతోందని వెల్లడించారు. ఈ వార్తతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

నిజానికి అదే సమయంలో తమ సినిమాను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేశామని.. కానీ ‘పెద్ది’ వంటి పెద్ద సినిమా వస్తుండటంతో తాము వెనక్కి తగ్గుతున్నామని ఎస్.కె.ఎన్ తెలిపారు. షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ చిత్రం జూన్ చివరి వారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే చిత్ర యూనిట్ నుండి ఈ కొత్త తేదీపై అధికారిక ప్రకటన రానుంది.

Exit mobile version