‘కిక్ 2’తో విజయ్ ‘పులి’ ట్రైలర్..!

‘కిక్ 2’తో విజయ్ ‘పులి’ ట్రైలర్..!

Published on Aug 17, 2015 11:37 PM IST

Puli
తమిళ సూపర్ స్టార్ విజయ్, శృతి హాసన్ జంటగా తమిళంలో రూపొందిన వంద కోట్ల బడ్జెట్ సినిమా ‘పులి’. విజయ్ అభిమానులే కాక, సినీ పరిశ్రమ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమాకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే తమిళ వర్షన్‌తో పాటు తెలుగు వర్షన్ కూడా ఒకేరోజున సెప్టెంబర్ 17న విడుదల కానుంది. ఇక ఈ మధ్యే విడుదలైన తమిళ ఆడియోకు మంచి రెస్పాన్స్ రాగా, థియేట్రికల్ ట్రైలర్‌ను ఆగష్టు 20న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.

తమిళ ట్రైలర్‌తో పాటు అదే రోజు తెలుగు ట్రైలర్ కూడా ఆన్‌లైన్లో విడుదల కానుంది. ఇక ఆ తరువాతి రోజు నుంచి ‘కిక్ 2’ థియేటర్లలో తెలుగు వర్షన్ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు. రవితేజ-సురేందర్ రెడ్డి సూపర్ హిట్ సినిమా ‘కిక్’కు రీమేక్‌గా ‘కిక్ 2’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా చివరకు ఆగష్టు 21కి ఫిక్స్ అయింది. విజయ్ ‘పులి’ సినిమా విషయానికి వస్తే. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు చింబుదేవన్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు