అక్టోబర్ 30న వస్తోన్న ‘పున్నమిరాత్రి’

Punnamirathri
శ్రద్ధా దాస్, మోనాల్ గజ్జర్, శ్వేతాబసు ప్రసాద్, ప్రభు, నాజర్, సుధీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా వినయన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పున్నమి రాత్రి’. ఓ హర్రర్ కథాంశంతో 3డీలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ, మళయాలంలోనూ ఏకకాలంలో రూపొందింది. కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత ఎం. సుబ్బారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 30న విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 2డీ, 3డీ వర్షన్స్‌లో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని, భారీ గ్రాఫిక్స్‌తో రూపొందిన ఈ సినిమా హర్రర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతినిస్తుందని తెలిపారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన సంగీత దర్శకుడు భభిత్ జార్జ్, సినిమాటోగ్రాఫర్ సతీష్‌ల పనితనం ఈ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.

Exit mobile version