దుర్గమ్మకు మొక్కును తీర్చుకున్న ‘రోజా’ – ‘పురాణపండ ‘ పుస్తకాలు భక్తితో సమర్పణ

Puranapanda Srinivas book 'Durge Praseeda', published by Roja

విజయవాడ:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం ప్రముఖ సినీ నటి , ఎ.పి.ఐ.ఐ. సి. చైర్మన్, నగరి ఎమ్మెల్యే శ్రీమతి రోజా ఒక అపూర్వ ఘట్టానికి తెరతీశారు.

అమ్మవారికి ఎంతో ఇష్టమైన మూలా నక్షత్రం రోజున మహా సరస్వతి దివ్య అలంకారం సందర్భంగా కొండపై వేలాది భక్తులకు , సరస్వతి పూజలో పాల్గొన్న దంపతులకు, విద్యార్థి బృందాలకు తాను ప్రచురించిన ‘ దుర్గే ప్రసీద ‘ అద్భుతమని పోకెట్ దివ్య గ్రంధాన్ని స్వయంగా తానే పంచి పెట్టడం అందరినీ విశేషంగా
ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాలలోని కాకుండా విదేశాలలో సైతం విఖ్యాతి చెందిన ప్రముఖ రచయిత శ్రీ పురాణపండ శ్రీనివాస్ ఈ అపురూప గ్రంధానికి రచనా సంకలన కర్త కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పురాణపండ శ్రీనివాస్ తో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, లెజెండ్ నందమూరి బాలకృష్ణ ,
వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు వంటి సినీ ప్రముఖులే కాకుండా తెలుగు రాష్ట్రాలలో రాజకీయ రంగంలో ఉద్దండులైన మంత్రులు , మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ, ఆనం రాంనారాయణ రెడ్డి, బొత్సా సత్యనారాయణ, తుమ్మల నాగేశ్వర రావు, శ్రీమతి కిల్లి కృపారాణి, కన్నా లక్ష్మీ నారాయణ, తీగల కృష్ణా రెడ్డి , అంబికా కృష్ణ వంటి వారు పురాణపండ శ్రీనివాస్ బుక్స్ ని పరమ అద్భుతమైన రీతిలో ప్రచురించి ఉచితంగా వితరణ చెయ్యడం గమనార్హం.

అంతేకాదు . గత ముఖ్యమంత్రులు వై.ఎస్. రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, కొణిజేటి రోశయ్య ఆయా సందర్భాలలో శ్రీనివాస్ బుక్స్ ని ఆవిష్కరించి అభినందనలు వర్షించగా , ఇప్పటి తెలంగాణా – ఆంధ్రా ముఖ్యమంత్రులు కె.సి.ఆర్. , వై.ఎస్.జగన్ లు కూడా పురాణపండ శ్రీనివాస్ దైవ గ్రంధాలను ఆవిష్కరించి ప్రశంసలు వర్షించారు. తన జీవనయానంలో ఎన్నో కష్టాలను , సవాళ్ళను ఎదుర్కొని కూడా.. ..మొక్కవోని ఆత్మస్థర్యంతో తెలుగులో సూపర్ హిట్ దైవ గ్రంధాలను సమర్పిస్తున్న పురాణపండ శ్రీనివాస్ చక్కని గ్రంధానికి శ్రీమతి రోజా ప్రచురణ కర్తగా వ్యవహరించి … తానే నవరాత్రులలో స్వయంగా పంచిపెట్టడం మీడియాలో సంచలం సృష్టిస్తోంది. రోజా మానవతావాది. భక్తి హృదయం సంపూర్ణంగా నిండిన రాజకీయ నాయకురాలు.

ఇటీవల పురాణపండ శ్రీనివాస్ పరమ రమణీయ రచనా సంకలనం ‘ శ్రీపూర్ణిమ ‘ మంగళ గ్రంధానికి కూడా రోజా సమర్పకులుగా వ్యవహరించడం , చాగంటి కోటేశ్వర రావు వంటి ఉద్దండ పండితుల ఆశీర్వచనాన్ని శ్రీపూర్ణిమ గ్రంధం పొందడం తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి దాయకంగా మారింది. రోజా ఎన్ని ఆలయాలకు ఈ పుస్తకాన్ని ఇచ్చిందో లెక్కేలేదు. ఆంతా తిరుమల శ్రీనివాసుడు దయ అంటారామె. పురాణపండ శ్రీనివాస్ రమణీయ సొగసుల రచనా నైపుణ్యం , నిస్వార్ధ సేవకు రోజా అంకిత భావం తోడవ్వడం ఈ పుస్తకాలకు ఇంతటి అపూర్వాన్ని తెచ్చిపెట్టింది. రోజా , పురాణపండ శ్రీనివాస్ చాలాకాలంగా మంచి స్నేహితులు కావడంతోనే ఈ పరమార్ధ సౌందర్యాలు ఇంతటి శోభను సంతరించుకుంటున్నాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం దుర్గమ్మ తల్లి నవరాత్రులలో రోజా పాకెట్ బుక్ ‘ దుర్గే ప్రసీద ‘ కోసం భక్తజనం ఎగబడ్డారని ఆలయ వర్గాలు గొంతెత్తి మరీ చెబుతున్నాయి. దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు ఇలాంటి మంచి పని తానే చేసి ఉంటే బాగుండేదని పలువురు వ్యాఖ్యానించడం కొసమెరుపు.

సరస్వతీ పూజ రోజు మాత్రమే కాకుండా దుర్గాష్టమి, మహర్నవమి రోజున విచ్చేసిన భక్తులకు కూడా ఈ చిన్ని పవిత్ర ‘ దుర్గే ప్రసీద ‘ గ్రంధాన్ని( నూట ముప్పై పేజీలతో అమ్మ వారి మంత్రం భాగాలు, స్తోత్ర భాగాలునిండిన చక్కని వ్యాఖ్యానాల గ్రంధం ) ఆలయ అధికారులు పంచడం రోజా, పురాణపండ శ్రీనివాస్ లకు ఎంత అదృష్టమో కదా. వచ్చే సంవత్సరం రోజా ఎలాంటి గ్రంధాన్ని అమ్మకు సమర్పిస్తుందో వేచి చూద్దాం.

Exit mobile version