విడుదల తేదీ : ఫిబ్రవరి 27, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : సాయి సింహాద్రి, వినోద్ కుమార్, మీరా రాజ్, వాసు ఇంటూరి తదితరులు
దర్శకుడు : బత్తుల సతీష్
నిర్మాత: సాయి సింహాద్రి
సంగీత దర్శకుడు : రిషి ఎం
సినిమాటోగ్రాఫర్ :విఆర్‌కె నాయుడు
ఎడిటర్ :అమర్నాథ్
సంబంధిత లింక్స్ :ట్రైలర్
సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించిన తాజా తెలుగు చిత్రం ‘సన్ ఆఫ్’. తండ్రీకొడుకుల మధ్య ఉండే సంఘర్షణలు మరియు వారి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ నేపథ్యంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 27) థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఆనంద్(సాయి సింహాద్రి) తన తాత ఆస్తిని వారసత్వంగా తనకే దక్కాలంటూ తన తండ్రి వెంకట్ రావు(వినోద్ కుమార్)పై కోర్టులో కేసు వేస్తాడు. దీంతో వెంకట్ రావు తన కొడుకు సమర్ధుడు అని నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేస్తాడు. తన కొడుకు పట్ల వెంకట్ రావు ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తాడు..? అసలు ఆయన పెట్టిన ఛాలెంజ్ ఏమిటి..? వారి మధ్య న్యాయపరంగా ఎలాంటి విభేదాలు తలెత్తుతాయి..? అనేది ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఓ మధ్య తరగతి తండ్రిగా వినోద్ కుమార్ చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బాధ్యతగల తండ్రిగా, తన కొడుకు భవిష్యత్తు కోసం తపనపడే పాత్రలో ఆయన ఒదిగిపోయారు. తండ్రీకొడుకు మధ్య వచ్చే సీన్స్‌లో ఆయన నటన ఆకట్టుకుంటుంది.
సాయి సింహాద్రి నిర్మాతగానే కాకుండా యాక్టర్‌గా చక్కటి ప్రతిభను చూపారు. ఆయన పర్ఫార్మెన్స్ అక్కడక్కడా తడబడినా, ఒక చక్కటి ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకులకు అందించాలనే ఆయన ప్రయత్నం మెప్పిస్తుంది.
చాలా ఇళ్లలో జరిగే కథ కావడంతో ఈ సినిమా ప్రేక్షకులను త్వరగా కనెక్ట్ అవుతుంది. ఇక కథకు కోర్ట్‌రూమ్ డ్రామా మరింత బలంగా నిలిచింది. సెకండాఫ్‌లోని కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయి.
మైనస్ పాయింట్స్ :
కోర్ట్‌రూమ్ సెటప్ కాస్త కొత్తగా అనిపించినా, దానిని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఇంటర్వెల్ ముగిసే లోపే కోర్ట్ రూమ్ సీన్స్ ముగియడంతో సెకండాఫ్‌పై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది.
ఇలాంటి ఇంటెన్స్ కథకు నటీనటుల పర్ఫార్మెన్స్‌లు చాలా ముఖ్యం. సాయి సింహాద్రి నటనపరంగా కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంకా బెటర్‌గా పర్ఫార్మ్ చేసుండాలి. ఎవరైనా అనుభవం ఉన్న నటుడు అయితే తన పర్ఫార్మెన్స్‌తో ఈ కథకు బలం చేకూర్చేవారు.
ఇక ఈ సినిమాలోని లవ్ ట్రాక్ పెద్దగా ఆకట్టుకోదు. హీరోయిన్ మీరా రాజ్ పాత్రను పక్కాగా రాసుకోలేదు. ఆమె చేసిన కొన్ని సీన్స్ నాచురల్‌గా అనిపించవు. కథకు హీరోహీరోయిన్ రొమాంటిక్ ట్రాక్ మైనస్‌గా నిలిచింది.
తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ఈ సినిమాకు బలంగా ఉండటానికి రైటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. వారి మధ్య సంభాషణలు కూడా ఇంకా కొన్ని ఎక్కువ ఉండి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు సతీష్ బత్తుల తండ్రీకొడుకల అనుబంధాన్ని కొత్తగా చూపెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను రూపొందించారు. అయితే, స్క్రీన్ ప్లే పై ఆయన ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కేది. రిషి ఎం. సంగీతం అక్కడక్కడా వర్కవుట్ అయింది. కొన్ని సీన్స్‌కు మ్యూజిక్ బలాన్ని ఇచ్చింది. వీఆర్‌కే నాయుడు సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్ విషయంలో ఇంకా బెటర్‌గా వర్క్ చేసి ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్‌లో చాలా సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉంటే కథపై ఆసక్తి పెరిగేది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే ‘సన్ ఆఫ్’ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయిందని చెప్పాలి. తండ్రీ కొడుకుల అనుబంధం అనే చక్కటి పాయింట్‌తో చిత్రాన్ని తెరకెక్కించినా.. వీక్ రైటింగ్, ఆకట్టుకోని కథనం, పెద్దగా మెప్పించని పర్ఫార్మెన్స్‌లు ఈ సినిమాకు డ్యామేజ్ చేశాయి. కోర్ట్ రూమ్ యాంగిల్ ఉన్నా, దాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు. రొమాంటిక్ ట్రాక్ కూడా పెద్దగా మెప్పించలేదు. ఎంటర్‌టైనింగ్ సినిమాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్ వేరే ఆప్షన్స్ చూసుకోవడం బెటర్.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team
