పురాణపండ శ్రీనివాస్ ప్రసంగాలకు నెటిజన్లు ఫిదా !

పురాణపండ శ్రీనివాస్ ప్రసంగాలకు నెటిజన్లు ఫిదా !

Published on Oct 16, 2021 4:00 PM IST

Puranapanda Srinivas

విజయవాడ : అక్టోబర్ 17

ఇంతవరకు చాగంటి కోటేశ్వర రావు , గరికపాటి నరసింహ రావు , సామవేదం షణ్ముఖ శర్మ వంటి శిఖరాయమానమైన మహా పండితులు యూట్యూబ్ లో మాట్లాడుతుంటే … రోజుల్లో లక్షల్లో వ్యూస్ పెరిగి ఫాలోయర్స్ , అభిమానులు అభివాదాలుగా మారిపోవడం మనం చూస్తున్నాం.

పదేళ్లనాడు అనేక వేదికలపై అదరగొట్టి, చాలా కాలంగా మౌనంగా ఉంటున్న ప్రముఖ రచయిత, అద్భుతమైన వక్త పురాణపండ శ్రీనివాస్ తో ఇటీవల యూట్యూబ్ ఛానల్ లో ప్రముఖ యాంకర్ గీతా భగత్ వేసిన ఆధ్యాత్మిక ప్రశ్నలకు చాలా ఇన్ఫర్మేషన్ కూడిన చెప్పిన విశేషాలు అత్యద్భుతగా ఉండటంతో లక్షల్లో వ్యూస్ పెరిగి పురాణపండ శ్రీనివాస్ చెప్పే స్పిరిట్యుయల్ సబ్జెక్టు పట్ల నెటిజనులు చాలా ఆసక్తి చూపడం విశేషం. తెలుగునాట ఆధ్యాత్మిక రచనల్లో , సంకలనాల్లో అపూర్వస్థాయిలో ఉన్నతంగా ఉన్న పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలకున్న క్రేజ్ అంతా ఇంతాకాదు.

ఒక దశాబ్దం క్రితం శ్రీనివాస్ భాషాసంస్కారంతో ప్రసంగించే అంశాలంటే కొన్ని వర్గాల వ్యక్తులు చెవులు కోసుకునేవారు. జీవన యాత్రలో ఎదుర్కొన్న కష్టాల వల్ల చాలా కాలంగా పురాణపండ శ్రీనివాస్ మౌనంగా వున్నారు. ఏ అంశాన్నైనా అద్భుతంగా మాట్లాడగల దమ్మున్న పురాణపండ ఎంతో ఇన్ఫర్మేటివ్ గా మాట్లాడటంతో నెటిజనులు గత నెలన్నరగా ఈయన చెప్పే వివరణాత్మక ఆధ్యాత్మిక అంశాలపట్ల విశేషమైన ఆసక్తి కనబరిచారని స్పష్టంగా తెలుస్తోంది.

పురాణపండ శ్రీనివాస్ కృషిని చూసిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సి. నారాయణ రెడ్డి ధార్మిక గ్రంథ విరాట్ చైతన్యంగా శ్రీనివాస్ ని అభివర్ణించిన విషయం భాగ్యనగర రసజ్ఞులకూ ఎరుకే. ఏదేమైనా అపారమైన మేధా శక్తితో పాటు అపురూపమైన భాషావిలువలు బాగా వంటపట్టించుకున్న గొప్ప వక్త అయిన శ్రీనివాస్ ఇన్నాళ్ళకైనా చక్కని అంశాలను చెప్పడం సంతోషమని వేదపండిత, అర్చకులతో పాటు భక్త బృందాలు సైత చప్పట్లు చరచడం గమనించదగ్గ అంశం.

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం కి వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. , రెండు ఎపిసోడ్స్ గా వారాహి అమ్మవారి పై, రెండు వీడియోలుగా శివ కవచం పై, ఆదిత్య హృదయం పై పురాణపండ చెప్పిన వివరణాత్మక పవిత్రఅంశాలు నెటిజెన్ల మనసుల్ని దోచుకున్నాయి కాబట్టే మూడు లక్షల పై చిలుకు వ్యూస్ అదిరిపోతున్నాయి. శ్రీనివాస్ జీ బెస్ట్ అఫ్ లక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు