పూరి ఛార్మీల ఔదార్యం భేష్

Puri Charmi

ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఘనవిజయం దర్శకులు పూరి జగన్నాధ్, నటి మరియు నిర్మాత ఛార్మి లకు మరపురానిది అని చెప్పవచ్చు. దానికి కారణం ఆ చిత్రం ఆర్థికంగా వారికి బలం చేకూర్చడంతో పాటు, వారి పరాజయాలకు పరంపరకు తెరదింపి ముందడుగు వేయడానికి కావలసిన ధైర్యం ఇచ్చింది. అందుకే ఎప్పుడూ లేనంతగా పూరి,ఛార్మి ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక పూరి జన్మదినం నాడు ఇస్మార్ట్ శంకర్ మూవీని తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల రీరిలీజ్ చేస్తున్నారు.

ఐతే ఇస్మార్ట్ శంకర్ లాభాల నుండి కొంత వెచ్చించి పరిశ్రమలో కొందరికి ఆర్థిక సాయం చేయాలని నిశ్చయించుకున్నట్లు వారు ప్రకటించడం జరిగింది. సినిమాకోసం తమ విలువైన సమయాన్ని కేటాయించి ఎటువంటి అభివృద్ధి లేకుండా మిగిలిపోయిన కొందరు డైరెక్టర్స్ మరియు కో డైరెక్టర్స్ లో 20మందిని ఎంపిక చేసి వారికి కొంత ఆర్థిక సహాయం చేయనున్నారు. ఈనెల 28న ఉదయం 10గంటల నుండి ప్రసాద్ లాబ్స్ లో పూరి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఆ కార్యక్రమంలో వారికి పూరి ఛార్మి ఆర్థిక సహాయం చేసే అవకాశం కలదు. సినిమా పై ప్రేమతో పరిశ్రమకు వచ్చి అన్ని కోల్పోయిన వారిపట్ల పూరి ఛార్మీల ఔదార్యం చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేం.

Exit mobile version