నిజ జీవితంలో వేధింపులు ఎదుర్కుంటున్న ఓ యువ హీరోయిన్ కు సహాయం చేయడానికి దర్శకుడు పూరి జగన్నాధ్ ముందుకు వచ్చారు. పూరి జోక్యంతో సమస్య పరిష్కారమైంది. పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా పరిచయం అవుతున్న ‘ఆంధ్రా పోరి’ సినిమా షూటింగ్ ఖమ్మంలో జరుగుతుంది.
ఖమ్మం లోకల్ ఎస్.ఐ. షణ్ముఖ శర్మ ‘ఆంధ్రా పోరి’ మూవీ యూనిట్ స్టే చేస్తున్న హోటల్లో రైడింగ్ పేరుతో రెగ్యులర్ గా వస్తున్నారు. హీరోయిన్ ఉల్కాను గదికి వెళ్లి వేధిస్తున్నారు. ఈ విషయం పూరి సతీమణి లావణ్య దృష్టికి రావడంతో వెంటనే పూరికి చెప్పారు.
పూరి జగన్నాధ్, ఉన్నత అధికారులకు కంప్లైంట్ చేశారు. వారు వెంటనే ఎస్.ఐ. షణ్ముఖ శర్మపై చర్యలు తీసుకున్నారు. పూరి జగన్నాధ్ సహాయం చేయడం వల్ల తన సమస్య వెంటనే పరిష్కారం అయ్యిందని ఉల్కా సంతోషం వ్యక్తం చేసింది.


