డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా రోజుల తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ని డైరెక్ట్ చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే.. ‘హార్ట్ ఎటాక్’ సినిమా తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న పూరి ప్రస్తుతం ఎన్.టి.ఆర్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది.
ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కోసం పూరి పంచ్ డైలాగ్స్ కూడా రాసాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించనున్న ఈ సినిమా 2015 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


