తనిష్క్ రాజన్ ,ఖయ్యుమ్, షాని, పృథ్వి రాజ్ , సమీర్, లోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. ఈ చిత్ర టీజర్ ని ఈ రోజు సాయత్రం 6:30 గంటలకి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రిలీజ్ చేయనున్నారు .
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని హాల్ ఎంటర్టైన్మెంట్ పతాకం ఫై గౌతమ్ రాజ్ కుమార్ దర్శకత్వంలో గౌతమ్ ,కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు .ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు తీసుకరావడనికి సన్నాహాలు చేస్తున్నారు .
