
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘టెంపర్’. ఎన్.టి.ఆర్ సరికొత్త స్టైలిష్ లుక్, 6 ప్యాక్ బాడీతో తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చెయ్యడానికి వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ మరియు ఆడియోకి అభిమానుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం నందమూరి అభిమానులంతా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా డైరెక్టర్ అయిన పూరి జగన్నాధ్ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని కూడా తీసుకున్నారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం గోదావరికి చెందిన రైట్స్ ని సుమారు 2.5 కోట్లు పెట్టి పూరి కొనుక్కున్నాడు. దీనికోసం పూరి పాపులర్ డిస్ట్రిబ్యూటర్ అయిన సురేష్ మూవీస్ తో కలిసి పశ్చిమ గోదావరిలో రిలీజ్ చేయనున్నాడు. దీని ప్రకారం పూరికి సినిమాపై ఏ రేంజ్ నమ్మకం ఉందనేది మనకు తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.