పూరి – ఛార్మిల ‘జ్యోతిలక్ష్మి’ స్టార్ట్ అయ్యింది..

puri-charmi2
ప్రముఖ హీరోయిన్ చార్మీ ప్రధాన పాత్రలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘జ్యోతిలక్ష్మి’ స్టార్ట్ అయ్యింది. బుధవారం నాడు ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలు జరిగాయి. మొదట చార్మి ఒళ్ళు విరిచుకుంటున్న సన్నివేశాలను షూట్ చేశారు. బోల్డ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ‘టెంపర్’ విజయంతో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కేసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్.. ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్.

మల్లాడి వెంకట కృష్ణమూర్తి రచించిన ప్రసిద్ద నవలా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు పూరి తెలిపారు. ఈ సినిమా కోసం స్ట్రిక్ట్ డైట్ మైంటైన్ చేసిన ఛార్మి కొంచం వెయిట్ తగ్గింది. సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ సమర్పణలో శ్రీ శుభ శ్వేతా ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version