బాలయ్యతో ప్లాన్ చేస్తోన్న పూరి !

Published on Sep 17, 2019 10:45 am IST

పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నాడు పూరి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ సినిమా తర్వాత, పూరి.. బాలయ్య బాబుతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బాలయ్య – పూరి కాంబినేషన్‌లో ‘పైసా వసూల్’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఆ సినిమాలో బాలయ్యను చాల కొత్తగా చూపించాడు పూరి. అందుకే పూరితో మరో సినిమా చేయడానికి తానూ ఎప్పుడూ రెడీనే అని ఆ మధ్య బాలయ్య కూడా చెప్పుకొచ్చాడు. మొత్తానికి బోయపాటి శ్రీను – బాలయ్య సినిమా తర్వాత, పూరి – బాలయ్య సినిమా ఉంటుందట. ఇప్పటికే పూరి బాలయ్యకి లైన్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More