కన్నడ స్టార్ హీరోతో డాషింగ్ డైరెక్టర్ !

Published on Mar 22, 2021 10:00 am IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – కన్నడ స్టార్ హీరో ధ్రువ్ సర్జా కలయికలో ఓ సినిమా రాబోతుందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా హాల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వీరి కలయికలో సినిమా అనేది దాదాపు ఫిక్స్ అని.. పూరి కథ కూడా రాశాడని.. ఇప్పటికే పూరి, ధ్రువ్ సర్జాకి కథ వినిపించాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమా తెలుగు-కన్నడ- ద్విభాషా చిత్రం అట.

కాగా ప్రస్తుతం పూరి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో లైగర్ అంటూ గ్యాంగ్ స్టర్ డ్రామాతో మళ్లీ ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడట. అనన్య హీరోయిన్ గా వస్తోన్న ఈ సినిమాను కరణ్ జోహార్, పూరి, ఛార్మిలు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అవ్వగానే ధ్రువ్ సర్జా తో పూరి ఒక పాన్ ఇండియా మూవీని చేస్తాడట.

సంబంధిత సమాచారం :