ట్రైలర్ తో రాబోతున్న `అశ్వ‌థ్థామ‌` !

ట్రైలర్ తో రాబోతున్న `అశ్వ‌థ్థామ‌` !

Published on Jan 21, 2020 6:19 PM IST

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ను జనవరి 23న సాయంత్రం 5 గంటల 04 నిముషాలకు విడుదల చేయనున్నారు.

ఇక సమంత ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అత్యంత గ్రిప్పింగ్ గా ఉన్న ఈ టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. మరి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా పూర్తి చేసుకుంటుంది. కాగా నిర్మాత ఉషా ముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట.

ఈ సినిమాలో సందర్భానుసారం మంచి యాక్షన్ సీక్వెన్స్ స్ ఉన్నాయట. మొదటిసారి ఈ చిత్రంలో నాగ‌శౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. పోసాని కృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీ‌చ‌ర‌ణ్‌, కెమెరా మ‌నోజ్‌ రెడ్డి, ఎడిట‌ర్‌ గారీ బిహెచ్‌, డైరెక్ష‌న్ ర‌మ‌ణ్‌ తేజ‌.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు