విలన్ కోసం పూరి పాట్లు.. అతను ఓకే చెబుతాడా..?

Puri Jagannadh

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవల తన నెక్స్ట్ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో నటించబోయే సినిమాను పూరి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు పూరి రెడీ అవుతున్నాడు.

అయితే, ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో ఈ పాత్రలో సాలిడ్ యాక్టర్‌ను తీసుకోవాలని పూరి చూస్తున్నాడట. దీని కోసం మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ అయితే బాగుంటుందని పూరి భావిస్తున్నాడట. ఇప్పటికే పూరి కథను కూడా వినిపించాడని.. ఆయనకు అది నచ్చిందని తెలుస్తోంది.

కానీ, ఫహాద్ బిజీ షెడ్యూల్ వల్ల పూరి కోసం డేట్లు అడ్జస్ట్ చేయలేకపోతున్నారట. దీంతో పూరి వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా ఫహాద్ కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరి ఫహాద్ నిజంగానే ఈ సినిమాకు ఓకే చెబితే ఈ మూవీకి అదిరిపోయే బజ్ క్రియేట్ అవుతుంది.

Exit mobile version