పూరి, ప్రభాస్ కాంబినేషన్ సెట్టవుతుందా?

Published on Sep 12, 2019 2:28 am IST

‘బాహుబలి, సాహో’ ఇలా వరుసగా మూడు భారీ చిత్రాలతో జాతీయ స్థాయికి ఎదిగిపోయాడు ప్రభాస్. ఆయనతో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు రెడీగా ఉన్నారు. వారిలో పూరి జగన్నాథ్ కూడా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ను ప్రభాస్ తో చేయాలని భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది.

గతంలో పూరి ప్రభాస్ హీరోగా ‘బుజ్జిగాడు, ఏక్ నిరంజన్’ లాంటి సినిమాల్ని చేశారు. కానీ అవి రెండూ పెద్దగా మెప్పించలేదు. దీంతో ఎప్పటికైనా
తనకిష్టమైన ప్రభాస్ తో గ్రాండ్ హిట్ కొట్టాలన్నదే తన కొరికని పలు సందర్భాల్లో అన్నారు పూరి. ప్రభాస్ సైతం పూరి అంటే చాలా అభిమానిస్తూ ఉంటాడు.

పైగా పూరి కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు. మరి అంతా అనుకుంటున్నట్టు వీరి కాంబో త్వరలో సెట్టవుతుందేమో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ సినిమా చేస్తుండగా పూరి విజయ దేవరకొండతో సినిమాకు రెడీ అవుతున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More