పూరి జగన్నాధ్ శిష్యుడి రెండో సినిమా వివరాలు !

పూరి జగన్నాధ్ శిష్యుడి రెండో సినిమా వివరాలు !

Published on Mar 27, 2018 6:43 PM IST

శ్రీదేవి మూవీస్ కృష్ణప్రసాద్ సమర్పణలో సత్యదేవ్, నందిత శ్వేతా హీరో, హీరొయిన్లుగా నటిస్తోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోపీ గణేష్ పట్టాభి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళంలో మంచి విజయం సాధించిన ‘సదురంగ వెట్టై’ సినిమాకు తెలుగు రీమేక్ గా ఏ చిత్రం రూపొందుతోంది. త్వరలో ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు.

సత్యదేవ్ గతంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘జ్యోతి లక్ష్మి’ సినిమాలో నటించాడు. ఈ హీరో ’47డేస్, గువ్వా గోరింక’ సినిమాల్లో కూడ నటిస్తున్నాడు. గోపి గణేష్ గతంలో ‘రోమియో’ సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. పూరి జగన్నాద్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన గోపికి సత్యదేవ్ తో చేస్తున్న సినిమా రెండవది. ఈ మూవీ కి సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు