ఇస్మార్ట్ డెసిషన్ తీసుకున్న పూరి జగన్నాథ్

ఇస్మార్ట్ డెసిషన్ తీసుకున్న పూరి జగన్నాథ్

Published on Sep 26, 2019 5:58 PM IST

puri

‘ఇస్మార్ట్ శంకర్’ సాధించిన గొప్ప విజయం దర్శకుడు పూరిని గట్టిగా రీచార్జ్ చేసింది. పూరి కథల విషయంలోనే కాదు పబ్లిసిటీ, బిజినెస్ విషయంలో కూడా స్మార్ట్ అయిపోయారు. ముందుగానే అనుకున్నట్టు ఆయన, ఆయన పార్ట్నర్ ఛార్మి కలిసి ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని నిర్ణయించారు.

రేపు 27న రీరిలీజ్ కానున్న ఈ చిత్రం మూడు రోజుకు అనగా 29 వరకు మాత్రమే థియేటర్లలో ఉండనుంది. అది కూడా రెండు రాష్ట్రాల్లో కలిపి పది చోట్ల మాత్రమే. మొదటిసారి విడుదలైనప్పుడు చూడలేకపోయిన చాలామంది డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. వారికి సినిమాను థియేటర్లలో వీక్షించడానికి ఇది మంచి అవకాశం.

ఈ వారాంతంలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావట్లేదు. ‘గద్దలకొండ గణేష్’ మాత్రమే మెరుగ్గా నడుస్తోంది. పైగా విడుదలవుతున్న థియేటర్లన్నీ మాస్ ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉండే సెంటర్లే. వసూళ్ల పరంగా ఇది కలిసొస్తుంది. మొత్తానికి పూరి తీసుకున్న ఈ డెసిషన్ ఇస్మార్ట్ డెసిషన్ అనే అనాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు