స్క్రిప్ట్ రైటర్లకు పూరి జగన్నాధ్ ఓపెన్ ఆఫర్

Puri
స్క్రిప్ట్ రైటర్లకు, దర్శకత్వం వైపు అడుగులు వేసే ఔత్సాహికులకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ గన్స్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సోమవారం జరిగిన ‘రోమియో’ ప్రెస్ మీట్ లో పూరి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే రోజు సాయంత్రం ప్రతిభావంతులైన యువకులకు ఆహ్వానం పలుకుతూ ట్విట్టర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

కొత్త స్క్రిప్ట్ రైటర్ల కోసం డోర్ లు ఓపెన్ చేసి ఉన్నాయి. రండి, కలసి పనిచేద్దాం. మీ మనసులో ఆలోచనలను ఒక్క పేజీపై రాయండి, దానిని purimailbox@yahoo.com కి మెయిల్ చేయండి. మీ ఆలోచనలు నన్ను ఇంప్రెస్స్ చేస్తే, మీకు కాల్ చేస్తాను. అంటూ ట్విట్టర్, పేస్ బుక్ లలో పోస్ట్ చేశారు.

పూరి జగన్నాధ్ లాంటి అగ్ర దర్శకుడు, న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం, ఇంకెందుకు ఆలస్యం, రెడీ అయిపోండి. ఒక్క మెయిల్ కొట్టు, పూరి జగన్నాధ్ ఆఫీసులో అడుగుపెట్టు.

Exit mobile version