“జనగణమన” ను తేజ సజ్జతో ప్లాన్ చేసిన పూరి జగన్నాథ్?

“జనగణమన” ను తేజ సజ్జతో ప్లాన్ చేసిన పూరి జగన్నాథ్?

Published on May 15, 2024 10:00 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోలకు మాస్ ఇమేజ్ రావడానికి చాలా వరకు పూరి జగన్నాథ్ కారణం అని చెప్పాలి. తన సినిమాల్లో హీరో పాత్రలో సాలిడ్ మాస్ ఇమేజ్ ను తీసుకొచ్చే విధంగా డిజైన్ చేస్తారు పూరి. అయితే లైగర్ చిత్రం పరాజయం తరువాత, విజయ్ దేవరకొండ తో తను చేయాల్సిన జనగణమన చిత్రాన్ని నిలిపివేశారు. జనగణమన చిత్రం ను తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేశారు పూరి జగన్నాథ్. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది.

ఈ ఏడాది హను మాన్ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ సాధించిన తేజ సజ్జ తో పూరి జగన్నాథ్, ఈ జనగణమణ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తేజ సజ్జ ప్రస్తుతం మిరాయ్ చిత్రం లో నటిస్తూ, బిజీగా ఉన్నారు. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు పూర్తి అయ్యాక, వీరి కాంబినేషన్ లో సినిమా రానుంది. అందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు