కృష్ణతో పూరికి ఉన్న అనుబంధం అలాంటిది..!

Published on May 31, 2020 10:20 pm IST


నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా చిత్ర ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెవుతున్నారు. డైరెక్ట్ పూరి జగన్నాధ్ సైతం కృష్ణ గారితో తనకున్న అనుభవాన్ని, అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ట్విట్టర్ లో ‘పాతికేళ్ల క్రితం నేను తీసిన ఫోటో ఇది . ఒకసారి కృష్ణ గారు నన్ను కార్ ఎక్కించుకుని తీసుకెళితే సంగీత్ లో సినిమా కూడా చూసాం . ఆయన సినిమాల కోసం క్యూ లో నిలుచునే వాడిని , ఆ రోజు ఆయన పక్కన కూర్చున్న .మరిచిపోలేను.. కృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని పూరి జగన్నాధ్ ట్వీట్ చేశారు.

ఇక మహేష్ తో పోకిరి తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన పూరి, మరో చిత్రం బిజినెస్ మాన్ తో మరో హిట్ అందుకున్నారు. ఇక నేడు విడుదల అయిన సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ పోస్టర్ పై ప్రశంసలు కురిపించిన పూరి, ఈ చిత్రం భారీ విజయం సాధించనుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :

More