ఫిబ్రవరి 20 నుంచి పూరి – చార్మీల ‘జ్యోతి లక్ష్మీ’

Charmi
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత పూరి చేయనున్న 2 సినిమాలకు సంబందించిన ప్రాజెక్ట్స్ గురించి తాజాగా అనౌన్స్ చేసారు. పూరి నెక్స్ట్ డైరెక్ట్ చేయనున్న రెండు సినిమాలను సికె ఎంటర్ టైన్మెంట్స్ మరియు శ్రీ సుభ శ్వేతా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ వారు తమ తదుపరి సినిమా విశేషాలను తెలియజేశారు.

ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ముందుగా చార్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘జ్యోతి లక్ష్మీ’ సినిమా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 20 నుంచి మొదలు కానుంది. చార్మీతో పాటు సత్య, వంశీ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తే, సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నాడు. చాలా ఫాస్ట్ గా ఈ సినిమా షూటింగ్ చేసే విధంగా పూరి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ – వరుణ్ తేజ్ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది.

Exit mobile version