పోస్ట్ ప్రొడక్షన్‌లో ‘పురుష:’.. ఇంట్రెస్ట్ పెంచుతున్న కొత్త పోస్టర్

Purusha

కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుంది. ఈ కోవలోనే వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘పురుష:’. బత్తుల సరస్వతి సమర్పణలో, కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ బత్తుల ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతుండగా, వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా విడుదలైన ‘పురుష:’ కొత్త పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. “మగాళ్లను మొక్కుకుంటూ కాదు.. తొక్కుకుంటూ పోతాం” అంటూ పోస్టర్‌పై రాసిన క్యాప్షన్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పెళ్లి, ఆడ, మగ కాన్సెప్టులు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఆద్యంతం నవ్వించే కథతో, నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కసిరెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, వి.టి.వి. గణేష్, అనంత శ్రీరామ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Exit mobile version