“సింగం ఎగైన్” లో “పుష్ప 2” నటుడు!

“సింగం ఎగైన్” లో “పుష్ప 2” నటుడు!

Published on May 20, 2024 11:00 PM IST

సైతాన్ చిత్రం తో బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్నాడు అజయ్ దేవగన్. ఈ హీరో తదుపరి నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ సింగం అగైన్. ఈ చిత్రం సింగం రిటర్న్స్ కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్ మరియు అర్జున్ కపూర్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సింగం ఎగైన్ లోకి ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నటుడు వచ్చారు. అజయ్, తెలుగు సినిమాలో మంచి పాత్రలకు పేరుగాంచాడు. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్‌లో కనిపించబోతున్నాడు. సింగం అగైన్ లో పోలీసుగా నటిస్తున్నాడు. బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చేందుకు ఇది బెస్ట్ ఆఫర్. రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, జియో స్టూడియోస్ మరియు దేవగన్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు