ఓటిటిలో “హను మాన్” స్ట్రాటజీతోనే “పుష్ప 2”.!?

ఓటిటిలో “హను మాన్” స్ట్రాటజీతోనే “పుష్ప 2”.!?

Published on May 19, 2024 11:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ (Rashmika Mandanna) గా దర్శకుడు సుకుమార్ బి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2” కోసం తెలిసిందే. పాన్ ఇండియా సక్సెస్ చిత్రం పుష్ప ది రైజ్ కి కొనసాగింపుగా పుష్ప ది రూల్ గా రాబోతుండగా దీనిపై అంతకంతకు అంచనాలు పెరుగుతూ వెళ్తున్నాయి. అయితే పుష్ప 2 కి బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగినట్టుగా బజ్ ఉంది.

అందులోని ఓటిటి డీల్ అయితే ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డుకే అమ్ముడుపోయినట్టుగా టాక్ ఉంది. ఇప్పుడు దీనిపై మరింత సమాచారం తెలుస్తుంది. దీని ప్రకారం పుష్ప 2 థియేట్రికల్ గా రిలీజ్ అయ్యాక 60 రోజుల తర్వాత మాత్రమే రానున్నట్టుగా ఫిక్స్ చేశారట. దీనితో ఆగస్ట్ లో రిలీజ్ అయ్యిన చిత్రం రెండు నెలల తర్వాతే రానుంది అని చెప్పాలి.

మరి రీసెంట్ టైం లో అయితే పాన్ ఇండియా సెన్సేషన్ “హను మాన్” (Teja Sajja Hanu Man) ని కూడా థియేట్రికల్ రిలీజ్ అనంతరం 60 రోజుల తర్వాతే వదులుతామని చెప్పారు. అన్నట్టే సినిమా కూడా 60 రోజుల తర్వాతే ఓటిటిలో వచ్చింది. మరి ఈ ప్లాన్ కూడా హను మాన్ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యింది.

ఇక ఇప్పుడు పుష్ప 2 కి కూడా సాలిడ్ టాక్ పడిరి డెఫినెట్ గా మంచి లాంగ్ రన్ దొరుకుతుంది సో పుష్ప 2 విషయంలో మంచి ప్లానింగ్ నే చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు