‘పుష్ప 2’ లో అనసూయ ఫస్ట్ లుక్ ఇదే

‘పుష్ప 2’ లో అనసూయ ఫస్ట్ లుక్ ఇదే

Published on May 15, 2024 8:58 PM IST

“పుష్ప పుష్ప” అంటూ సాగే పాటతో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బన్నీ హుక్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ క్రేజీ సాంగ్ కు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడంలో నెటిజన్లు ఇంకా బిజీగానే ఉన్నారు. ఐతే, ఈ రోజు అనసూయ పుట్టినరోజు. ఈ ప్రత్యేక రోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో అనసూయ భీకరంగా కనిపించింది. అనసూయ ఫోజును చూస్తుంటే.. ఆమె ఎవర్నో ఆజ్ఞాపిస్తున్నట్లు ఉంది. మొత్తానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్‌ లో అనసూయ దాక్షాయణి గా కనిపించబోతుంది. ఇంతకీ, పుష్ప రాజ్ పై దాక్షాయణి పగ తీర్చుకుంటుందా ?, లేదా ?, ఆమె భర్త మంగళం శ్రీను (సునీల్ పాత్ర) ఏమయ్యాడు ? సమాధానాలు తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఆగక తప్పదు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు