మరోసారి మెస్మరైజ్ చేయడానికి వచ్చేస్తున్న పుష్పరాజ్, శ్రీవల్లి..

మరోసారి మెస్మరైజ్ చేయడానికి వచ్చేస్తున్న పుష్పరాజ్, శ్రీవల్లి..

Published on May 28, 2024 12:01 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప 1 తో పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ క్రేజ్ ని వారు సంపాదించుకున్నారు. ఇక సినిమాలో వారి కెమిస్ట్రీతో పుష్ప రాజ్, శ్రీవల్లి గా ఇండియాస్ ఫేవరెట్ జోడిలలో ఒకరిగా కూడా నిలిచారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి పాన్ ఇండియా ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసేందుకు రాబోతున్నారు. కపుల్ సాంగ్ అంటూ అనౌన్స్ చేసిన మేకర్స్ ఈ సాంగ్ ని మొత్తం 6 భాషల్లో శ్రేయ ఘోషల్ పాడినట్టుగా తెలిపారు.

అయితే ఈ సాంగ్ పై లేటెస్ట్ పోస్టర్ ని మేకర్స్ రివీల్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో అల్లు అర్జున్, రష్మిక లు నార్మల్ కాస్ట్యూమ్ లలో కనిపిస్తుండడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఓ ఫీచర్ సాంగ్ గా చూపిస్తారో ఏమో చూడాలి. అలాగే సినిమా వెర్షన్ లో ఇద్దరు ఎలాంటి లుక్ లో కనిపిస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ భారీ చిత్రం ఆగస్ట్ 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు