‘పుష్ప – 2’ : పవర్ఫుల్ గా ఫస్ట్ సాంగ్ ప్రోమో

‘పుష్ప – 2’ : పవర్ఫుల్ గా ఫస్ట్ సాంగ్ ప్రోమో

Published on Apr 24, 2024 4:37 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్ పై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియన్ మూవీని క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది.

ఇక నేడు కొద్దిసేపటి క్రితం ఈ మూవీ నుండి పుష్ప పుష్ప అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. పుష్ప పుష్ప అంటూ కోరస్ తో ఈ ప్రోమో పవర్ఫుల్ గా అదిరిపోయింది. కాగా ఫుల్ లిరికల్ సాంగ్ ని మే 1న ఉదయం 11 గం. ల 7ని. లకు విడుదల చేయనున్నారు. ఇక పుష్ప 2 మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 15న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు