గ్లోబల్ గా “పుష్ప పుష్ప” రూల్ సెన్సేషన్

గ్లోబల్ గా “పుష్ప పుష్ప” రూల్ సెన్సేషన్

Published on May 2, 2024 1:59 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ బి తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి అవైటెడ్ ఫస్ట్ సింగిల్ “పుష్ప పుష్ప” ని రిలీజ్ చేయగా దేవిశ్రీ ప్రసాద్ మరోసారి ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ ని అందించారు. అయితే ఈ సాంగ్ వచ్చి 24 గంటలు గడవకుండానే ఈ సాంగ్ ఏకంగా 9 దేశాల్లో ట్రెండ్ అవుతూ గ్లోబల్ గా అదరగొడుతుంది.

ఒక్క తెలుగు లోనే కాకుండా పాన్ ఇండియా భాషల్లోనే అనేక దేశాల్లో ఈ సాంగ్ ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. అంతే కాకుండా గత 24 గంటల్లో అయితే వరల్డ్ లోనే అత్యధికంగా చూసిన సాంగ్ గా కూడా ఇది నిలిచింది. మొత్తానికి అయితే పుష్ప 2 సాంగ్ రీ సౌండ్ మాత్రం గ్లోబల్ లెవెల్లో అదరగొడుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది ఆగస్ట్ 15న పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు