‘పుష్ప – 2’ : దిమ్మతిరిగే ధరకు అమ్ముడైన హిందీ రైట్స్

‘పుష్ప – 2’ : దిమ్మతిరిగే ధరకు అమ్ముడైన హిందీ రైట్స్

Published on Apr 18, 2024 1:30 AM IST

పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ తో అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఆగష్టు 15న ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇక తాజాగా పుష్ప 2 నార్త్ ఇండియా హిందీ రైట్స్ ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఏఏ ఫిలిమ్స్ అధినేత అనిల్ తడానీ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ రైట్స్ ని అనిల్ అడ్వాన్స్ బేసిస్ లో ఏకంగా రూ. 200 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారట.

కాగా ఇది నార్త్ ఇండియన్ రీజియన్ లో అత్యధిక రికార్డు అని, గతంలో షారుఖ్ ఖాన్ జవాన్ రూ. 150 కోట్లకు అమ్ముడవగా దానిని కూడా మించి దిమ్మతిరిగే ధరకు పుష్ప 2 అమ్ముడవడంతో అక్కడ ఈ మూవీకి ఆడియన్స్ లో ఎంత హైప్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాగా సేఫ్ జోన్ లోకి రావాలంటే పుష్ప 2 మూవీ హిందీ బెల్ట్ లో మొత్తంగా రూ. 400 కోట్ల నెట్ రాబట్టాలి. మరి పుష్ప 2 మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు