‘పుష్ప – 2’ ఇంటర్వెల్ ఎపిసోడ్ డిఫరెంట్ స్టైల్ లో ?

‘పుష్ప – 2’ ఇంటర్వెల్ ఎపిసోడ్ డిఫరెంట్ స్టైల్ లో ?

Published on Feb 23, 2024 12:20 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతోన్న పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. విషయం ఏమిటంటే, తాజాగా ఈమూవీ యొక్క ఇంటర్వెల్ ఎపిసోడ్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతోంది.

దాని ప్రకారం రెగ్యులర్ గా పెద్ద సినిమాల్లో మంచి యాక్షన్ ఎపిసోడ్ తో ఇంటర్వెల్ ఎపిసోడ్స్ ఉంటాయి, అయితే అందుకు భిన్నంగా హృదయానికి హత్తుకునే ఎమోషనల్ సాంగ్ తో పుష్ప 2 మూవీలో ఇంటర్వెల్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారట సుకుమార్. చిన్న ఫైట్ అనంతరం వచ్చే ఈ సాంగ్ అందరి మనసులు తాకడంతో పాటు సెకండ్ హాఫ్ పై మంచి ఇంట్రెస్ట్ ని ఏర్పరుస్తుందట. కాగా ఈ మూవీని ఆగష్టు 15న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు