“పుష్ప 2” విషయంలో ముందే క్లారిటీ ఇస్తున్న మేకర్స్

“పుష్ప 2” విషయంలో ముందే క్లారిటీ ఇస్తున్న మేకర్స్

Published on Apr 2, 2024 2:06 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప 2” (Pushpa 2) కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎదురు చూస్తుండగా ఈ ఏప్రిల్ నెల మొదలు కానుండడంతోనే మేకర్స్ కూడా సాలిడ్ అప్డేట్స్ అందిస్తున్నట్టుగా రంగం సిద్ధం చేశారు.

అయితే రీసెంట్ గా టాలీవుడ్ లో పలు భారీ చిత్రాలు రిలీజ్ డేట్ లు మారడంతో పుష్ప 2 కి కూడా ఎఫెక్ట్ పడొచ్చు అని అలాగే ఇతర చిత్రాలు చూస్తున్నట్టుగా వస్తున్నాయి. దీనితో పుష్ప రిలీజ్ డేట్ పై కొందరు అనుమానాలు పెట్టుకున్నారు కానీ మేకర్స్ మాత్రం నిన్నటి అప్డేట్ నుంచే ఆగస్ట్ 15 డేట్ నే నొక్కి చెప్తున్నారు. నిన్నటి అప్డేట్ సహా ఇవాళ అప్డేట్ లో కూడా మేకర్స్ అదే డేట్ ని మెన్షన్ చేశారు. దీనితో ఇతర చిత్రాలు కంటే ముందే తమ సినిమా విషయంలో తాము క్లారిటీ ఇచ్చారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు