పుష్ప 2 మూవీ పై లేటెస్ట్ ఇన్ఫో!

పుష్ప 2 మూవీ పై లేటెస్ట్ ఇన్ఫో!

Published on Apr 23, 2024 3:00 AM IST

పుష్ప ది రైజ్ (Pushpa the rise) మూవీ తో వరల్డ్ వైడ్ సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఈ చిత్రం బన్నీ కెరీర్ లో కీలక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రానికి సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule) భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఐకాన్ స్టార్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తుండగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను రిలీజ్ చేయగా, నేషనల్ వైడ్ గా సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సాంగ్ షూట్ లో టీమ్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మే ఫస్ట్ వీక్ లో మేకర్స్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన అప్డేట్ ఈ వారం లోగా రానున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు