“పుష్ప 2 ది రూల్” షూటింగ్ పై లేటెస్ట్ ఇన్ఫో!

“పుష్ప 2 ది రూల్” షూటింగ్ పై లేటెస్ట్ ఇన్ఫో!

Published on May 19, 2024 2:00 AM IST

పుష్ప 2 ది రూల్, అల్లు అర్జున్ యొక్క తదుపరి భారీ చిత్రం. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్ట్ 15, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం దాదాపు షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఫహద్ ఫాసిల్ కి సంబందించిన సన్నివేశాలతో సహా ఒక ఐటెం సాంగ్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ షూటింగ్ అనంతరం వచ్చే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్, జగదీష్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు